బాలుడికి కల్వర్టుతో వివాహం.. అక్కడ అదో ఆచారం!
- ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఘటన
- పిల్లలకు తొలి దంతం కనుక పైదవడకు వస్తే ఐదేళ్లలోపు అలాంటి వివాహం
- మకర సంక్రాంతి రెండో రోజున ఘనంగా వివాహం
- ఐదేళ్ల లోపు పెళ్లి చేయకుంటే వివాహమయ్యాక భాగస్వామి మరణిస్తారని నమ్మకం
- అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్న గిరిజనులు
మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు ఇక్కడ అఖన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడికి ఘనంగా వివాహం జరిపించారు. తొలి దంతం పైదవడకు వచ్చిన చిన్నారులకు కల్వర్టుకు కానీ, చెట్టుకు కానీ ఇచ్చి వివాహం జరిపించకుంటే పెళ్లయిన తర్వాత వారి భాగస్వామి మరణిస్తారని గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గిరిజనులు ఇప్పటికీ పాటిస్తుంటారు. చిన్నారులకు ఐదేళ్లు వచ్చే లోపే వారికి వివాహం జరిపిస్తుంటారు.