Dhanush: గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ధనుశ్ 'రాయన్'

Dhanush 50th movie update
  • ధనుశ్ 50వ సినిమాకి సన్నాహాలు
  • ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే గ్యాంగ్ స్టర్ కథ 
  • ధనుశ్ బ్రదర్స్ గా ముగ్గురు హీరోలు 
  • నిర్మాణ సంస్థగా సన్ పిక్చర్స్   
తెలుగు .. తమిళ భాషల్లో హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ ఉంది .. ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ధనుశ్ పరిచయమే. అలాంటి ధనుశ్ 50వ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం సన్ పిక్చర్స్ వారు వదిలారు. 

ఈ కథ ఒక స్లంప్ ఏరియాలో జరగనుందనే హింట్ ఇస్తూ ఈ పోస్టర్ కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సన్ పిక్చర్స్ వారు తెలియజేశారు. ఈ కథ నార్త్ చెన్నైకి సంబంధించిన ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. 

గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ నటించనుండగా, ఆయన ముగ్గురు సోదరులుగా ఎస్.జె.సూర్య .. విష్ణు విశాల్ .. కాళిదాస్ జయరామ్ కనిపించనున్నారు. ఇక ఆయన చెల్లెలి పాత్రను దుషార విజయన్ పోషించనుందని అంటున్నారు. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడిగా కూడా ధనుశ్ పేరే వినిపిస్తుండటం విశేషం.
Dhanush
Rayan Movie
Kollywood

More Telugu News