Venkatesh: వెంకీ కెరియర్లో భారీ బడ్జెట్ మూవీ ఇదేనట!

  • వెంకీ 75వ సినిమాకి సన్నాహాలు 
  • పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న వెంకీ 
  • కథానాయికగా తెరపైకి శ్రీనిధి శెట్టి పేరు 
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన  
Venkatesh latest movie update

వెంకటేశ్ ఈ మధ్య కాలంలో ఇటు థియేటర్స్ లోను .. అటు ఓటీటీలోను వరుస హిట్లతో సందడి చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన 75వ సినిమాపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఉండబోతోందనీ, వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపించింది. 

అయితే ఈ సినిమా సంఖ్య పరంగా ప్రత్యేకతను సంతరించుకోవడం వలన, సురేశ్ ప్రొడక్షన్స్ లోనే చేయలనే ఉద్దేశంతో సురేశ్ బాబు ఉన్నారని సమాచారం. వెంకటేశ్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ కలిగిన చిత్రంగా తీర్చిదిద్దడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. 

'ఘర్షణ' తరువాత వెంకటేశ్ ఆ స్థాయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయలేదు. 'బాబు బంగారం' సినిమాలో పోలీస్ ఆఫీసరే అయినా ఆ పాత్ర ఫన్నీగా ఉంటుంది. 75వ సినిమాలో మాత్రం ఆయన పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక కథానాయికగా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. మరో కథానాయికకి కూడా ఈ కథలో చోటు ఉందని చెబుతున్నారు. మార్చిలో ఈ సినిమా షూటింగును మొదలెట్టి, 'దసరా'కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News