elections: ఆ మూడు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల నగారా!

  • త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఈరోజు మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
  • ఈ ఏడాదిలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
Election shedule to be released for three states

దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు అంతా సిద్ధమైందని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ గడువు మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఏయే తేదీన ఎన్నికలు నిర్వహించేది ప్రకటించేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. నామినేషన్ల నుంచి ఫలితాల ప్రకటన వరకు వివరాలను ఈసీ వెల్లడించనుంది. కాగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల తర్వాత కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణలలో కూడా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.

More Telugu News