Anand Mahindra: ఈ ఇంటిని మడత పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

Anand Mahindra shares vedio of a portable house Rs 40 lakh for a 500 square feet home
  • అందుబాటు ధరల ఇళ్లకు దీన్ని పరిష్కారంగా పేర్కొన్న ఆనంద్ మహీంద్రా
  • స్టూడియో అపార్ట్ మెంట్ నమూనాలో 500 చదరపు అడుగుల సైజు ఇల్లు
  • ధర సుమారుగా రూ.40 లక్షలు
ఇల్లంటే సామాన్యులకు ఓ పెద్ద కల. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో నెరవేరే స్వప్నం. అంత కష్టపడి కట్టుకున్న ఇల్లును.. ఏదో అవసరం కోసమని, మరో ప్రాంతానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు అమ్ముకోవడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. అప్పటి వరకు అన్నేళ్లపాటు ఆ ఇంటితో అల్లుకున్న బంధాలు, జ్ఞాపకాలను మరిచిపోవడం అంటే అంత సులభం కాదు. కానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే ఈ బాధ తొలగిపోతుంది.

కోరుకున్న చోటికి సులభంగా తీసుకెళ్లి నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవడమే ఈ ఇంటి ప్రత్యేకత. దీన్ని ఫోల్డబుల్ హౌస్ గా చెబుతారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా ఉంటుంది. చిన్న కుటుంబానికి సరిపోతుంది. లేదంటే బ్రహ్మచారులకు అనుకూలం. దీని ధర 49,500 డాలర్లు. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.40 లక్షలు . 

‘‘దీన్ని భారత్ లో మరిత చౌకగా తయారు చేయవచ్చు. విపత్తుల తర్వాత వేగంగా షెల్టర్ ఏర్పాటుకు ఈ నమూనా చక్కగా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్లను అందించాలన్న మన సమస్యలకు ఆవిష్కరణలే సమాధానం అవుతాయి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీని పేరు బాక్సబుల్ ఫోల్డింగ్ హౌస్. ఈ చిన్ని ఇంట్లో ఒక ఓపెన్ కిచెన్, బెడ్ రూమ్, హాల్ ఉంటాయి. దీన్ని ఫోల్డ్ చేసి, కావాల్సిన చోట అన్ ఫోల్డ్ చేసుకోవడమే. మరిన్ని వివరాలను https://www.boxabl.com/ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.
Anand Mahindra
shares vedio
portable house
Rs 40 lakh

More Telugu News