మరో రూ. 550.14 కోట్ల 'రైతు బంధు' నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ఖమ్మం బీఆర్ఎస్ సభ నవశకానికి నాంది అన్న మంత్రి నిరంజన్ రెడ్డి
- సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కాబోతున్నదని వ్యాఖ్య
- బీజేపీలో వణుకు పుడుతున్నదని ఎద్దేవా చేసిన మంత్రి
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కాబోతున్నదని చెప్పారు. నాడు తెలంగాణ కోసం, నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఇప్పుడు ఆహారరంగం మీద పడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతటా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక, బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నదని, అందుకే తెలంగాణ మీద కక్షగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని ఆరోపించారు. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు.