Tamannaah Bhatia: మళ్లీ జంటగా కనిపించిన తమన్నా

Tamannaah Bhatia Vijay Varma go on a drive together day after reuniting at awards night
  • ముంబైలోని బాంద్రాలో దర్శనం
  • ఆఫ్ పీస్ స్కర్ట్ ధరించిన తమన్నా
  • వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న అభిప్రాయాలకు బలం
టాలీవుడ్ తార తమన్నా భాటియా ఈ మధ్య జంటగా కనిపించి ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ వర్మ, తమన్నా భాటియా మరోసారి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కెమెరా కంట్లో పడ్డారు.  గోవాలో జరిగిన నూతన సంవత్సరం వేడుకల పార్టీలో వీరు తళుక్కుమనడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో, వీరిద్దరు సహజీవనంలో ఉన్నారనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. 

ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ కలసి కనిపించడం అనుమానాలను బలపరిచేలా ఉంది. తమన్నా మోకాలి పైకి ధరించిన సింగిల్ స్కర్ట్ తో కనిపించింది. విజయ్ బ్లూరంగు హుడీలో కనిపించాడు. దీనికి ఒక రోజు ముందు అవార్డుల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. గోవాలో జరిగిన న్యూఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలింతలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అనంతరం గోవా నుంచి ముంబైకి కలిసే తిరిగొచ్చారు. వీరి బంధం వివాహ బంధంగా మారుతుందా? అన్నది చూడాల్సిందే.
Tamannaah Bhatia
Vijay Varma
together
mumbai
bandra

More Telugu News