Jayamalini: నేను కూడా ఒక హీరో ప్రేమలో పడ్డాను: జయమాలిని

Jayamalini Interview
  • రెండు దశాబ్దాల పాటు వెలిగిన జయమాలిని 
  • లవ్ లెటర్స్ విపరీతంగా వచ్చేవని వెల్లడి 
  • చాలామంది ప్రపోజ్ చేశారని వ్యాఖ్య 
  • చనిపోయేలోగా ఆ హీరోకి ఆ మాట చెప్పాలన్న జయమాలిని  
జయమాలిని తెలుగు .. తమిళ .. మాలయాళ .. కన్నడ భాషల్లో రెండు దశాబ్దాలకి పైగా ఒక వెలుగు వెలిగారు. నిన్నటి తరం ప్రేక్షకులకు జయమాలిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డాన్సర్ గాను .. హీరోయిన్ గాను ఆమె గుర్తుండిపోయే సినిమాలను చేశారు. ఆనాటి తారలలో అత్యధిక సంపన్నుల జాబితాలో ఆమె పేరు కూడా కనిపిస్తుంది. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ .. "అప్పట్లో చాలామంది నాకు ఐ లవ్ యు చెప్పారు. పెళ్లి చేసుకుందామని కొంతమంది నేరుగా నాతోనే అన్నారు. నాకు వచ్చే లవ్ లెటర్స్ చూడటానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉండేవారు. మా అమ్మను అడిగే ధైర్యం లేక, మా అక్కయ్య ద్వారా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించేవారు" అన్నారు. 

నన్ను ప్రేమించినవారి సంగతి అలా ఉంచితే .. నేను కూడా ఒక హీరోను ప్రేమించాను. అయితే ఆయనతో ఆ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు ఆయనకి భార్య .. పిల్లలు ఉన్నారు. ఆయన కూడా నన్ను ఇష్టపడ్డారు. అయితే ఆ హీరో ఏ భాషకి చెందినవారనేది నేను ఇప్పుడు చెప్పను. కానీ, ఇంకా ఎన్నాళ్లు ఈ విషయాన్ని మనసులోనే దాచుకోగలం అనిపిస్తూ ఉంటుంది. నేను చనిపోయేలోగా ఆ హీరోను కలిసి నా మనసులోని ప్రేమ విషయం ఆయనకి చెప్పాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Jayamalini
Actress
Tollywood

More Telugu News