Rishabh Pant: వీళ్లిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా: రిషబ్ పంత్

Pant acknowledged two youth who helped him at accident site
  • గత డిసెంబరులో రోడ్డు ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్
  • కారు నుంచి బయటికి తీయడంలో సాయపడిన ఇద్దరు యువకులు
  • నేడు పంత్ ను పరామర్శించిన యువకులు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.  

కాగా, పంత్ యాక్సిడెంట్ కు గురైన సమయంలో అతడిని కారు నుంచి బయటికి తీసుకురావడంలో హర్యానా రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ తో పాటు ఇద్దరు స్థానిక యువకులు కీలకపాత్ర పోషించారు. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయతీ చాటుకున్నారు. ఆ యువకులు ఇవాళ పంత్ ను ఢిల్లీ ఆసుపత్రిలో పరామర్శించడానికి వచ్చారు. దీనిపై పంత్ స్పందించాడు. 

"నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు హీరోలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి. యాక్సిడెంట్ అనంతరం వాళ్లిద్దరూ ఎంతో సాయపడ్డారు. నేను సకాలంలో సురక్షితంగా ఆసుపత్రికి చేరడంలో వాళ్ల సహకారం మరువలేనిది. రజత్ కుమార్, నిషు కుమార్... మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News