Chandrababu: చంద్రబాబు రాకతో పీలేరు సబ్ జైలు వద్ద కోలాహలం... ఫొటోలు ఇవిగో!

Chandrababu at Pileru sub jail
  • పుంగనూరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పీలేరు సబ్ జైలుకు తరలింపు
  • జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు
  • కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైనం
పోలీసులు అరెస్ట్ చేసిన పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం పరామర్శించారు. పీలేరు సబ్ జైలులోకి వెళ్లిన చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, కేసులకు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తెగించి పోరాడితే టీడీపీదే విజయం అని స్పష్టం చేశారు. 

కాగా, చంద్రబాబు రాక నేపథ్యంలో పీలేరు సబ్ జైలు వద్ద భారీ కోలాహలం నెలకొంది. పరిసర గ్రామాల నుంచి కూడా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. చంద్రబాబును చూసి నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని వెలిబుచ్చారు. చంద్రబాబు కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు.
Chandrababu
Sub Jail
Pileru
TDP

More Telugu News