Ziva: స్టార్ క్రికెటర్ల కుమార్తెలపై వ్యాఖ్యలు... ఎఫ్ఐఆర్ నమోదు

FIR registered on who made remarks over star cricketers daughters
  • ధోనీ కుమార్తె జివా, కోహ్లీ కుమార్తె వామికపై దారుణ వ్యాఖ్యలు
  • స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్
  • చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు నోటీసులు
  • త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తారన్న చైర్ పర్సన్
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జివా, వామికలపై సోషల్ మీడియాలో దారుణ రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. 

దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. తమ నోటీసుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి, జైలుకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎఫ్ఐఆర్ కాపీని కూడా ట్వీట్ చేశారు.
Ziva
Vamika
MS Dhoni
Virat Kohli
Remarks
FIR
Police
Delhi Women Commission

More Telugu News