New Zealand: హైదరాబాద్ చేరుకున్న న్యూజిలాండ్ క్రికెటర్లు

New Zealand team reaches Hyderabad
  • ఈనెల 18న ఇండియా - న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
  • ఆన్ లైన్ లో మాత్రమే టికెట్ల విక్రయాలు
  • కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న టీమిండియా జట్టు
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. ఆన్ లైన్ లో టికెట్స్ కొనుగోలు చేసిన వారు... ఎల్బీ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియంలలో ఫిజికల్ టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. 

మరోవైపు తొలి వన్డే కోసం న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన కివీస్ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ ఎస్కార్ట్ మధ్య ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు కివీస్ ప్లేయర్లు చేరుకున్నారు. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. టీమిండియా ఆటగాళ్లు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.
New Zealand
Team
Hyderabad
Team India

More Telugu News