Balakrishna: బాలయ్యను ఒప్పించిన 'బింబిసార' డైరెక్టర్!

  • 'బింబిసార'తో వశిష్ఠకి పెరిగిన డిమాండ్ 
  • రజనీకి కథ వినిపించిన డైరెక్టర్ 
  • 'జైలర్' రిలీజ్ తరువాత రానున్న క్లారిటీ 
  • గీతా ఆర్ట్స్ 2లోను ఒక సినిమా చేసే ఛాన్స్ 
Balayya in Vashista Movie

కల్యాణ్ రామ్ వరుస ఫ్లాపులతో ఇటు హీరోగా .. అటు నిర్మాతగా సతమతమవుతూ ఉండగా, 'బింబిసార' సినిమాతో ఆయనకి తిరుగులేని హిట్ ను ఇచ్చాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా కల్యాణ్ రామ్ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. అందువల్లనే 'బింబిసార' కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

ఇప్పుడు ఈ డైరెక్టర్ కి డిమాండ్ పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేయడానికి యంగ్ స్టార్ హీరోలు .. సీనియర్ స్టార్ హీరోలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యకి కూడా వశిష్ఠ ఒక కథను వినిపించాడట. కథ కొత్తగా ఉండటం వలన, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ఈ కాంబో ఉంటుందని అంటున్నారు. 

ఇక రజనీ వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ ఉండటంతో, ఆయనకి కూడా వశిష్ఠ ఒక కథను వినిపించాడని చెబుతున్నారు. 'జైలర్' రిలీజ్ తరువాత ఈ ప్రాజెక్టు విషయంలో ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లోను వశిష్ఠ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News