Jayamaloni: అందుకే మా అబ్బాయిని హీరోను చేయలేదు: జయమాలిని

Jayamalini Interview
  • ఒకప్పుడు జయమాలిని విపరీతమైన క్రేజ్ 
  • వివాహమైన తరువాత సినిమాలకి దూరం 
  • ఆస్తిపాస్తులకు కొదవ లేదన్న జయమాలిని 
  • తన కొడుక్కి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని వెల్లడి
వందల సినిమాలు చేసిన జయమాలిని, అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వివాహమైన తరువాత మాత్రం ఆమె నటించలేదు. చాలా కాలం పాటు మీడియాకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె, ఈ మధ్య కాలంలోనే ఫంక్షన్లకు రావడం .. ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టారు.

సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ .. "పెళ్లి తరువాత సినిమాల్లో చేయలేదు .. బాబు పుట్టడంతో అతని ఆలనా పాలన చూస్తూ ఉండిపోయాను. ఇక సినిమాల గురించిన ఆలోచన చేయలేదు. అప్పట్లో నేను డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా ఇచ్చేదానిని. అందుకు సినిమాలలో కంటే ఎక్కువగా ఇచ్చేవారు. 

ఆస్తిపాస్తులకు కొదవలేదు .. చెన్నైలో నాలుగు బంగ్లాలు ఉన్నాయి. వాటిపై కూడా మాకు రెంట్లు వస్తుంటాయి. ఎలాంటి చెడు అలవాట్లు లేని కారణంగా మేము సంపాదించింది నిలబెట్టుకోగలిగాము. మా అబ్బాయి మంచి అందగాడు .. కానీ అతనికి యాక్టింగ్ పట్ల ఇష్టం లేదు .. మేము కూడా ఒత్తిడి చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
Jayamaloni
Actress
Tollywood

More Telugu News