Upasana: బేబీ బంప్ ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన

Upasana shares baby bump photo
  • త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న చరణ్, ఉపాసన దంపతులు
  • బిడ్డ గురించి భావోద్వేగ ట్వీట్ చేసిన ఉపాసన
  • మాతృత్వాన్ని ఆస్వాదించడమే తనకు సంక్రాంతి అని ట్వీట్
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తమ ఇంట అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం మెగా ఫ్యామిలీ ఆత్రుతగా ఎదురు చూస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా ఆ ఘడియల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పుట్టబోతున్న బిడ్డ గురించి ట్విట్టర్ వేదికగా ఉపాసన ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.

 'తనకు సంక్రాంతి అంటే మాతృత్వాన్ని ఆస్వాదించడమే' అని ఆమె ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభాన్ని సెలెబ్రేట్ చేసుకోవడమే తనకు సంక్రాంతి అని చెప్పారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. 
Upasana
Ramcharan
Tollywood

More Telugu News