Remote Voting Mission: రిమోట్ ఓటింగ్ మిషన్ పై ముగిసిన అఖిలపక్ష సమావేశం

  • వలస ఓటర్లు ఎక్కడినుంచైనా ఓటు వేసేలా ఆర్ వీఎం 
  • ఆర్ వీఎంను ప్రతిపాదించిన కేంద్ర ఎన్నికల సంఘం
  • చర్చించిన రాజకీయ పక్షాలు
  • ఆర్ వీఎంను పార్టీలన్నీ వ్యతిరేకించాయన్న దిగ్విజయ్ సింగ్
All Party Meeting on Remote Voting Mission concludes

ఢిల్లీలో రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్ వీఎం) పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ఆర్ వీఎంపై చర్చించేందుకు ఈ అఖిలపక్షం ఏర్పాటు చేశారు. దేశంలో వలస ఓటర్లు ఎక్కడినుంచైనా ఓటు వేసేలా ఈసీ... ఆర్ వీఎంను ప్రతిపాదించింది. అయితే ఈ రిమోట్ ఓటింగ్ మిషన్ ను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, జేడీయూ, జేఎంఎం, నేషనల్ కాంగ్రెస్, వీసీకే, పీడీపీ తదితర రాజకీయ పక్షాలు హాజరయ్యాయి. 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, ఈసీ ప్రతిపాదించిన ఆర్ వీఎంను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా వ్యతిరేకించాయని వెల్లడించారు. ఈ నెల 25న మరోసారి సమావేశమై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు.

More Telugu News