Vande Bharat: విజయవాడ చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్... చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

  • వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు
  • వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరిక
  • రైలు రాకను ఫోన్లలో చిత్రీకరించిన ప్రజలు
Vande Bharat train arrives Vijayawada

దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇకపై తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నడవనుంది. ఇవాళ సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. 

ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు. 

ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం... ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

More Telugu News