Kadiyam Srihari: రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదు... ఇకపైనా వంచబోను: కడియం శ్రీహరి

Kadiyam Srihari comments got attention
  • కడియం శ్రీహరి వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • తప్పుచేసినవాడే తలవంచుతాడన్న కడియం
  • తనకు ఆ అవసరం రాలేదని వెల్లడి
  • ఆర్జించడం కాదు ఆత్మగౌరవంతో నిలబడాలని వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ రాజకీయవేత్త కడియం శ్రీహరి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తప్పు చేసినవాడే తలవంచుతాడు... నేను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదు... ఇకపైనా తలవంచబోను అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని స్పష్టం చేశారు. ఆర్జించడం కాదు ఆత్మగౌరవంతో నిలబడాలి అని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. 

అయితే ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారో స్పష్టత లేదు. కడియం శ్రీహరికి, ఎమ్మెల్యే రాజయ్యకు విభేదాలున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Kadiyam Srihari
BRS
MLC
Telangana

More Telugu News