Balakrishna: 'వీరసింహారెడ్డి' సినిమా ఫస్టు డే వసూళ్లు ఇవే!

Veera Simha Reddy Movie Update
  • నిన్ననే విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • తొలిరోజున ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ షోస్
  • మాస్ హీరోగా మరోసారి విజృంభించిన బాలయ్య  
  • ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్     
బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో నిర్మితమైన 'వీరసింహారెడ్డి' .. నిన్ననే థియేటర్లకు వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. 

హైదరాబాదులో ఉదయం నాలుగు గంటల షోకే 54 థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడటం ఒక విశేషంగా చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం మరో విశేషం. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హనీరోజ్ ముఖ్యమైన పాత్రను పోషించింది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ అయినప్పటికీ, తన పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చింది. కథాకథనాలు .. మాటలు .. పాటలు .. డాన్సులు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఇలా అన్నీ కలిసి రావడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టిందనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి..
Balakrishna
Sruthi Haasan
Honey Rose
Veerasimha Reddy Movie

More Telugu News