Chandrababu: పవన్ కల్యాణ్ ను ఎందుకు తిడుతున్నారు?: చంద్రబాబు

Chandrababu fires on YSRCP
  • వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్
  • పవన్ పై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
  • వైసీపీ నేతలకు ఎందుకంత భయమన్న చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిన్న నిర్వహించిన సభలో వైసీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వరుసగా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లెకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. 

నిన్నటి సభలో పవన్ కల్యాణ్ ఆయన చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు పవన్ ను ఎందుకు తిడుతున్నారని, వారికి ఎందుకంత భయం, ఎందుకు అంత పిరికితనమని ప్రశ్నించారు. అధికారంతో వచ్చిన అహంకారం మంచిది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని జోస్యం చెప్పారు.
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News