Balakrishna: 'వీరసింహారెడ్డి' సాధించిన తొలిరోజు రికార్డులు ఇవే!

Veerasimha Reddy Veera Mass Blockbuster Meet
  • గోపీచంద్ మలినేని రూపొందించిన 'వీరసింహారెడ్డి'
  • హైదరాబాదులో 54 థియేటర్స్ లో ఎర్లీ మార్నింగ్ 4 గంటల షో
  • ఇది ఒక రికార్డు అని చెప్పిన డైరెక్టర్ 
  • బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని వెల్లడి  
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా, భారీ అంచనాల మధ్య ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ వచ్చింది. దాంతో మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్ ను 'వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్' పేరుతో నిర్వహించారు. 

ఈ వేదికపై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. "హైదరాబాదులో 54 థియేటర్లలో ఉదయం 4 గంటలకు షో పడటమనేది తెలుగు సినిమా చరిత్రలోనే లేదు. నిజంగా ఇది ఒక రికార్డు. ఈ షో కోసం రాత్రి 1 గంటకు బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం అరగంటలోనే టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి. తెల్లవారు జామునే వచ్చి వెయిటింగులో ఉండి సినిమా చూశారంటే అది మామూలు విషయం కాదు' అన్నారు. 

" నా కెరియర్లో నా సినిమాకి సంబంధించి ఇన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు .. ఇంతటి అభినందనలు రాలేదు. 'సమరసింహారెడ్డి' .. 'నరసింహనాయుడు' తరహాలో ఒక మాస్ హిస్టీరియాను చూస్తున్నామని చాలామంది కాల్స్ చేశారు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను ఈ సినిమా రాబట్టడం విశేషం. ఈ రికార్డును సెట్ చేసిన సినిమా నాది కావడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni

More Telugu News