Pawan Kalyan: ఇదిగో మూడు ముక్కల ముఖ్యమంత్రీ... మీ నాన్నకే భయపడలా!: పవన్ ఫైర్

  • శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి సభ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్
  • మీ నాన్ననే ఎదుర్కొన్నానంటూ వ్యాఖ్యలు
  • డైమండ్ రాణి అంటూ రోజాపై ఫైర్
Pawan Kalyan dares CM Jagan

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో ఏర్పాటు చేసిన యువశక్తి సభా వేదికపై పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు, బూతులు తిట్టే మంత్రులు, బెదిరించే గూండాలు, మన ఆస్తుల ఆక్రమణలు, అసలే రెండు ముక్కలైన రాష్ట్రాలను మూడు ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు అంటూ మండిపడ్డారు. ఈ మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువని అన్నారు. ఇదొక మూడు ముక్కల ప్రభుత్వం, ఇతనొక మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించారు. 

"కచ్చితంగా మూడు ముక్కల ముఖ్యమంత్రే. ఇందాక మా ఆది చెప్పినట్టుగా, ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడ్ని అంటాడు. ఇదుగో మూడు ముక్కల ముఖ్యమంత్రీ... ఈ రణస్థలం నుంచి చెబుతున్నా. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నవాడ్నయ్యా. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచెలూడిపోయేలా తరిమికొట్టండి అని చెప్పా. ఆ మాట సరదాగా చెప్పలేదు. ఆ తర్వాత మీ నాన్న మనుషులు నాపై దాడులు, మహబూబ్ నగర్ లో నా సభ వేదిక కూల్చివేయడం, నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు... ఇవన్నీ ఎదుర్కొనే వచ్చానయ్యా మూడు ముక్కల ముఖ్యమంత్రీ! గుర్తుపెట్టుకోండి... ఇలాంటి వాటికి నేను భయపడేవాడ్ని కాను. ఏంచేస్తావు నువ్వు... నువ్వేమైనా దిగొచ్చావా? మాట్లాడితే మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అంటావు.... నేను విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకున్నాను మూడు ముక్కల ముఖ్యమంత్రీ!" అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 

ఇక, కాయ్ రాజా కాయ్ బ్యాచ్ ఉంటుంది.. ఆఠీన్ రాజాలు, డైమండ్ రాణులు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఢంకాపలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి, చేతగాని మూడు ముక్కల ప్రభుత్వం ప్రతినిధులు నన్ను మాటలంటారు. నేను అన్నింటికీ తెగించినవాడ్నిరా బాబూ! తీవ్రవాద ఉద్యమం వైపు వెళితేనే న్యాయం జరుగుతుందని చాలా చిన్న వయసులోనే ఆలోచించి, వెళ్లకుండా ఆగిపోయినవాడ్ని. నా తెగింపు అప్పుడెలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. 

వీళ్లు మాట్లాడితే ప్యాకేజీ, ప్యాకేజీ అంటారు... నేను చెప్పాను గదరా మీకు.. మీరు మర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాదగా మాట్లాడతా. మీరు ఇలాంటి మాటలే మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానని చెప్పాను కదా. రణస్థలం అంటే బొబ్బిలిరాజులు, విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలంరా బాబూ ఇది... ఇక్కడి నుంచి ఆ సన్నాసులకు మరోసారి చెబుతున్నా. నా ఎదురుగా వచ్చి, నా చేతికి అందేంత దగ్గరగా వచ్చి, నువ్వు ప్యాకేజీ అను... నేనేం చేస్తానో చూపిస్తా. ఈసారి మా జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతా, మా వీర మహిళ చెప్పుతీసుకుని కొడతా. 

ఈ సంబరాల రాంబాబు ఉంటాడొకడు. బాగా తెలివిగా, అన్నీ తెలిసినవాడిలా ముదురుముఖం వేసుకుని "పవన్ కల్యాణ్ గారు" అంటాడు... ఏమిటయ్యా మాటలు! ఈ పిచ్చి కూతలు ఆపేసి పనిచూడండి. నేను చెప్పాను కదా... యుద్ధం చేస్తానంటే చేస్తాను. ఇవాళ వైసీపీ గూండాలకు చెబుతున్నా... ఈ రోజు నుంచి నేను బతికున్నంతవరకు మీతో పోరాటం చేస్తాను. మీరు మాట్లాడే ప్రతి మాట నేను గుర్తుంచుకుంటాను, మా జనసైనికులు గుర్తుంచుకుంటారు. 

మీరంతా జీవితాన్ని ఇంకా జుర్రుకోవాలని కోరుకుంటారు. నేను మట్టి చిప్పలో పెట్టినా తింటా. సినిమాలు పోతే మూసుకుని కూర్చుంటా. ఏదైనా మాట్లాడితే కాపులు నమ్మకూడదు, కాపులు నమ్మకూడదు అంటారు. నేను కులనాయకుడ్ని కాదురా సన్నాసుల్లారా... నేనేమీ ఒక కులం కోసం రాలేదు. దేశం బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నానురా సన్నాసుల్లారా! 

లాల్ బహదూర్ శాస్త్రి వంటి సమున్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్లు నన్ను విమర్శిస్తే నేను భరిస్తాను తప్ప, జైలుకెళ్లిన ఖైదీ నెం.6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా? నేను పోలీసునైతే చచ్చిపోతానబ్బా... ఖైదీ నెం.6093కి సెల్యూట్ కొట్టడం నా వల్ల కాదు. డీజీపీకి కూడా చెబుతున్నా... మీరు సెల్యూట్ కొడుతోంది ఖైదీ నెం.6093కి... ముఖ్యమంత్రికి కాదు. అలాగే... నా మీద నిఘా వేయకండి. మీ ఇంటెలిజెన్స్ కు ఖర్చు ఎందుకు చెప్పండి.

రెండు చోట్ల ఓడిపోయినోడు అంటూ ఆ  డైమండ్ రాణి రోజా కూడా నా గురించి మాట్లాడుతోందే...! నువ్వు కూడా నా గురించి మాట్లడతావా... ఛీ నా బతుకు చెడ! ప్రజల కోసం డైమండ్ రాణితోనైనా తిట్టించుకుంటా. భీమ్లానాయక్ రిలీజ్ ను ఆపితే రూ.30 కోట్లు పోతే నేను భరించలేదా? చెయ్యని తప్పుకు ఎస్పీ భయపెట్టాలని చూస్తే భరించలేదా? ఎందుకంటే స్వాతంత్ర్యం నా జన్మహక్కు. ప్రజాస్వామ్యం నాది... నేను ఈ దేశంలో పౌరుడ్ని. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుడ్ని... మూసుకుని కూర్చో! నోటికొచ్చినట్టు వాగకు... బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. పేపర్లు చూసి మాట్లాడొద్దు, హృదయంలోంచి మాట్లాడడం నేర్చుకో.

ప్రజలు ఉన్నారని నేను ధైర్యవంతుడ్ని కాదు... ఎవరూ లేకపోయినా నేను ధైర్యవంతుడ్నే. వర్షాకాలంలో మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు. సద్దాం హుస్సేన్ వంటి నియంతలను ఎంతమందిని చూడలేదు!... ఇందిరాగాంధీ వంటి వారు కూడా జైలుకు వెళ్లలేదా? ఈ సీఎం ఒక సైకోపాత్. కారణం లేకుండానే, అసందర్భంగా నవ్వుతుంటాడు... ఇదొక సైకోపాత్ లక్షణమే" అంటూ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 

ఈ పనికిమాలిన ఐటీ మినిస్టర్ వెధవ... వాడి పేరు కూడా గుర్తుకురావడం లేదు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పనికిమాలిన సన్నాసి, నీచ్ కమీనే, వెధవ ఓ వైశ్య వర్గానికి చెందిన ఆడపడుచుపై కేసు పెట్టాడని ఆరోపించారు. తొమ్మిదేళ్ల వయసున్న కొడుకును వదిలేసి ఆమె జైలుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

More Telugu News