Athiya Shetty: ఈ నెల 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం

Athiya Shetty and cricketer KL Rahul to tie the knot on THIS date in Khandala
  • మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు
  • సునీల్ శెట్టి నివాసం వద్ద నిర్వహణ
  • సినీ పరిశ్రమ, క్రికెట్ రంగం నుంచి ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి వివాహం దాదాపు ఖరారైనట్టే. ఈ నెల 23న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు వివాహ వేడుకలు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలుసు. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారానికి కూడా వచ్చాయి. కాకపోతే వివాహమే జాప్యమవుతూ వచ్చింది.

వీరి వివాహం మూడు రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఖండాలాలోని (ముంబై సమీప ప్రాంతం) సునీల్ శెట్టి నివాసంలో జరిగే పెళ్లి వేడుకకు ప్రముఖులతో పాటు సన్నిహితులను ఆహ్వానించనున్నారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని, అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ రంగం నుంచి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు వివాహ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు. అతియా, రాహుల్ చాలా కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరగడం అభిమానులకు తెలిసిందే. అతియా స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ ను సైతం ఇస్తుంటుంది.
Athiya Shetty
KL Rahul
wedding
january
sunil setty

More Telugu News