RRR: ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్.. రాజమౌళి సంచలన ప్రకటన

SS Rajamouli talks about RRR sequel says a fantastic idea came up we are in the process
  • సీక్వెల్ కోసం మంచి ఆలోచన తట్టిందన్న దర్శక దిగ్గజం 
  • ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నామని వెల్లడి
  • నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రం అఖండ విజయం సాధించింది. విడుదలై ఏడాది దాటినా ఈ చిత్రం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నో అవార్డులు వస్తున్నాయి. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను దక్కించుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ప్రకటించారు. దాన్ని స్ర్కిప్టుగా డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు ధ్రువీకరించారు. 

‘సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మేము సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయి. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నాం. ఆ తర్వాత, పాశ్చాత్య దేశాల్లోనూ ఆర్ఆర్ ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం మా నాన్న, మా కజిన్‌తో (రచన బృందంలో భాగమైన వారితో) మళ్లీ చర్చించా. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించాం. అయితే, స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో మేం ముందుకెళ్లలేం. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నాం’ అని రాజమౌళి వెల్లడించారు.
RRR
sequel
Rajamouli
Jr NTR
Ramcharan

More Telugu News