RRR: ‘ఆర్ఆర్ఆర్’కు మరో విశిష్ట పురస్కారం.. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు!

GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG to Natu Natu
  • ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు పురస్కారం
  • అవార్డు ప్రకటించిన వెంటనే చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేసిన టీం
  • కాలిఫోర్నియాలో అవార్డుల ప్రదానోత్సవం
టాలీవుడ్ ప్రముఖ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉన్న ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది.

కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేసింది.
RRR
Rajamouli
Junior NTR
Ramcharan
Golden Globe

More Telugu News