Telangana: సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందే... హైకోర్టు తీర్పు

Telangana High Court Order to CS Somesh Kumar to Move AP Cadre
  • ట్రైబ్యునల్ తీర్పును కొట్టేస్తూ హైకోర్టు ఆదేశాలు 
  • తీర్పును 3 వారాల పాటు నిలిపివేయాలన్న సోమేశ్ కుమార్ న్యాయవాది
  • అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్.. తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పు అమలును 3 వారాల పాటు నిలిపివేయాలన్న సోమేశ్ కుమార్ న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్ ను సొంత రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్ పై కొనసాగవచ్చని ట్రైబ్యునల్ సూచించింది.

అయితే, ఈ నిర్ణయంపై డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ట్రైబ్యునల్ తీర్పును కొట్టేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తాజాగా తీర్పు వెలువరించింది.
Telangana
cs somesh
High Court
ap cadre
ias officer

More Telugu News