పిల్లిని ఎత్తుకుపోయిన దొంగలు.. హైదరాబాద్ లో కేసు నమోదు

Cat theft in Hyderabad
  • పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేసిన మహమూద్ అనే వ్యక్తి
  • ఒక కన్ను గ్రీన్, మరో కన్ను బ్లూ కలర్ లో ఉండటం పిల్లి ప్రత్యేకత
  • ఆదివారం రాత్రి దాన్ని ఎత్తుకుపోయిన దుండగులు
హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి ఒక అరుదైన జాతికి చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. దానికి ఏమాత్రం లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దానికి నోమనీ అనే పేరు పెట్టుకున్నాడు. దీని వయసు 18 నెలలు. ఈ పిల్లి కళ్లలో ఒకటి గ్రీన్, మరొకటి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ పిల్లి ప్రత్యేకత ఇదే. దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎత్తుకుపోయారు. దీంతో, తన పిల్లిని ఎత్తుకుపోయారంటూ మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Go Back to Shorts
Cat
Hyderabad
Theft

More Telugu News