Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్!

South Central Railway Launched Robotic Body Massage Center At Vijayawada Railway Station
  • ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు
  • రెండు బాడీ మసాజ్, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ ఏర్పాటు
  • బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30
టికెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వేస్టేషన్‌లో రోబోటిక్ మసాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక మసాజ్ సెంటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుముతో బాడీ, ఫుట్ మసాజ్ సేవలను పొందొచ్చు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ మేనేజర్ శివేంద్ర మోహన్ సోమవారం దీనిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ. 60, ఫుట్ మసాజ్‌కు రూ. 30 రుసుము చెల్లించి రోబోటిక్ మసాజ్ సేవలను పొందొచ్చని ఐఆర్‌టీఎస్ సీనియర్ డీసీఎం వి.రాంబాబు పేర్కొన్నారు. కాగా, స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్‌లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన అవుట్‌లెట్లను ప్రారంభించారు.
Vijayawada
Vijayawada Railway Station
Robotic Massage Centre

More Telugu News