బీజేపీలో చేరనున్న ఖమ్మం బీఆర్ఎస్ కీలక నేత పొంగులేటి
- ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో కీలక పరిణామం
- పొంగులేటితో నేరుగా చర్చలు జరుపుతున్న బీజేపీ అధిష్ఠానం
- ఈ నెల 18న అమిత్ షాను పొంగులేటి కలవనున్నారని సమాచారం
బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు. బీజేపీ అధిష్ఠానం పొంగులేటితో నేరుగా చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ నెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కీలక ప్రకటన వెలువడుతుందని చెపుతున్నారు.
మరోవైపు బీజేపీలో చేరాలనే నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే తన సహచరులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి పలు నియోజవర్గాల్లో తన అనుచరులతో భేటీ కానున్నారు. మరోవైపు ఇటీవల పొంగులేటి మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రానికి శీనన్న సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ప్రజల అభిమానం ఉన్నవాడే అసలైన నాయకుడని... తనకు పదవి లేకపోయినా ప్రజాభిమానం ఎంతో ఉందని అన్నారు.