Rajamouli: షూటింగులో నేను చనిపోయాననుకుని రాజమౌళి పెద్దగా అరిచారు: అజయ్

  • విలన్ పాత్రలతో మెప్పించిన అజయ్ 
  • రాజమౌళిగారి వల్లనే 'విక్రమార్కుడు'లో ఛాన్స్ వచ్చిందని వెల్లడి
  • ఆ షూటింగులో జరిగిన ప్రమాదం గురించిన వివరణ
Ajay Interview

నటుడిగా విభిన్నమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్న అజయ్, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విలన్ పాత్రలు .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు ఆయనకి మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ .. 'విక్రమార్కుడు' కంటే ముందుగా నేను ఓ పదిహేను సినిమాలు చేశాను. కానీ 'విక్రమార్కుడు'తోనే మంచి క్రేజ్ వచ్చింది" అన్నాడు. 

'ఖుషి' సినిమాలో నన్ను చూసిన రాజమౌళిగారు, 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 'విక్రమార్కుడు' సినిమాలో విలన్ పాత్రకి నేను ఎంపిక కావడానికి ప్రధానమైన కారణం కూడా ఆయనే. నిజానికి ఆ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలాంటి నాకు విలన్ రోల్ ఇచ్చారు" అని చెప్పాడు. 

'విక్రమార్కుడు' షూటింగు విపరీతమైన ఎండల్లో జరిగేది. ఆ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగు జరుగుతోంది. క్రేన్ వర్క్ నేపథ్యంలో క్లైమాక్స్ ను ప్లాన్ చేశారు. రోప్ లాగే వ్యక్తి అజాగ్రత్తగా ఉండటం వలన నాకు ప్రమాదం జరిగింది. నేను చనిపోయాననుకుని రాజమౌళిగారు మైక్ లోనే పెద్దగా అరిచారు. క్షణాల్లో ఆయనతో పాటు ఆందరూ నా దగ్గరికి వచ్చారు. కాలికి బలమైన గాయం కావడం వలన, విపరీతంగా వాచిపోయింది. అదృష్టం బాగుండి ఆ రోజున బ్రతికి బయటపడ్డాను' అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News