ram gopal varma: RIP కాపులు... కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు: రామ్ గోపాల్ వర్మ

RIP Kapus and Congratulations Kammas tweets Ram Gopal Varma
  • చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్
  • డబ్బు కోసం కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని అనుకోలేదని వర్మ సెటైర్లు
  • వర్మపై మండి పడుతున్న జనసైనికులు
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. వీరి కలయిక ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు దారి తీసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడవొచ్చనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని అన్నారు. 'RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు' అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ram gopal varma

More Telugu News