Uttar Pradesh: కుక్కను చంపబోయి.. తన ప్రాణాలు తీసుకున్న మహిళ

UP woman kills her dog after being bitten drowns to death while disposing body in lake
  • ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన విషాదకర ఘటన
  • ఇంటి ఇల్లాలు, ఆమె కుమారుడ్ని కరిచిన పెంపుడు కుక్క
  • కోపంతో కుక్కను చంపేసిన ఇంటి ఇల్లాలు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తనను, తన కుమారుడ్ని పెంపుడు కుక్క కరవడంతో ఇంటి ఇల్లాలికి పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో ఆ కుక్కను కొట్టి చంపేసింది. ఆ కుక్కను తీసుకెళ్లి నీటిలో పడేయాలనుకుంది. కానీ, విధి ఆమె పట్ల క్రూరత్వం చూపించింది. కుక్కను నీటిలో పడేసే తరుణంలో ఆమె కూడా నీటిలో మునిగిపోయి ప్రాణాలు విడిచింది. 

సదరు మహిళ పేరు రూబి. ఈ విషయం ఏమీ తెలియని ఆమె భర్త తన భార్య కనిపించకపోయే సరికి ఆమె కోసం ఊరంతా వెతకడం మొదలు పెట్టాడు. చివరికి సరస్సు పక్కన ఆమె చెప్పులు కనిపించడంతో స్థానికుల సాయంతో అన్వేషించి ఆమె మృతదేహాన్ని బయటకు తీశాడు. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందింది. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం పంపించినట్టు అడిషనల్ డీసీపీ అలీ అబ్బాస్ తెలిపారు. పోస్ట్ మార్టమ్ నివేదికలోని అంశాల ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Uttar Pradesh
lucknow
women
bitten drown
dog
dwoned
death

More Telugu News