VJ Sunny: హరీశ్ శంకర్ చేతులమీదుగా 'ATM' టీజర్ రిలీజ్!

  • జీ 5 నుంచి 'ATM' వెబ్ సిరీస్ 
  • హరీశ్ శంకర్ అందించిన కథ ఇది 
  • దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మితమైన సిరీస్ 
  • ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • కీలకమైన పాత్రలో సుబ్బరాజు
ATM WebSeries

జీ 5 నుంచి మరో వెబ్ సిరీస్ రావడానికి రెడీ అవుతోంది .. ఆ వెబ్ సిరీస్ పేరే 'ATM'. ఈ వెబ్ సిరీస్ పై అనూహ్యమైన స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు కారణం ఇది దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మితం కావడం .. దీనికి హరీశ్ శంకర్ కథను అందించడం. 

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి టీజర్ ను వదిలారు. హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ టీజర్ బయటికి వచ్చింది. ఒక బస్తీలో పేదరికం కారణంగా తీవ్రమైన నిరాశకి లోనైన నలుగురు కుర్రాళ్లు కలిసి, ఒక ఏటీఎమ్ లో దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం తరువాత వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. 

 దొంగతనానికి పాల్పడిన నలుగురు కుర్రాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ గా సుబ్బరాజు కనిపిస్తున్నాడు. ఇతర ప్రధానమైన పాత్రల్లో వీజే సన్నీ .. దివి కనిపించనున్నారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News