Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన ప్రియాంక గాంధీ పెంపుడు శునకం

Priynaka Gandhi pet dog walks with Rahul Gandhi Bharat Jodo
  • హర్యానాలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర
  • రాహుల్ పాదయాత్రలో సందడి చేసిన లూనా
  • ఫొటోలు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఓ శునకం కూడా పాలుపంచుకుంది. దాని పేరు లూనా. లూనా ఎవరో కాదు... రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పెంపుడు శునకం. 

రాహుల్ పాదయాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రియాంక గాంధీ పెంపుడు శునకం లూనా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడిచింది. రాహుల్ గాంధీ దాన్ని నడిపించుకుంటూ ముందుకు సాగారు. లూనా ఉత్సాహాన్ని చూసి రాహుల్ కూడా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. 

కాగా, భారత్ జోడో యాత్ర హర్యానాలోని కర్నాల్ చేరుకున్న సందర్భంగా ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ కూడా రాహుల్ తో కలిసి నడిచారు.
Rahul Gandhi
Luna
Pet Dog
Bharat Jodo Yatra
Priyanka Gandhi
Haryana

More Telugu News