Vijay: 'వారసుడు' రిలీజ్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!

  • విజయ్ హీరోగా రూపొందిన 'వారసుడు'
  • ఈ నెల 11న విడుదల కానున్న సినిమా
  • రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ప్రచారం 
  • అదంతా పుకారేనని తేల్చేసిన మేకర్స్  
Varasudu Movie Update

విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఆయన మార్కెట్ పెరుగుతూ వెళుతోంది. ఆయన తాజా చిత్రంగా 'వారసుడు' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రానుంది. 

ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రాకపోవచ్చనీ .. డబ్బింగ్ పనులు పూర్తికాకపోవడమే అందుకు కారణమనే ప్రచారం జోరందుకుంది. 

దాంతో వెంటనే ఈ విషయంపై మేకర్స్ స్పందించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదనీ ... ముందుగా చెప్పిన ప్రకారం 11వ తేదీన థియేటర్లకు వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో పుకార్లను నమ్మొద్దని చెబుతూ, ఈ ప్రచారానికి తెరదించేశారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భారీ తారాగణమే సందడి చేయనుంది.

More Telugu News