comet: ఈ తోకచుక్కను ఇప్పుడు చూడకపోతే.. మళ్లీ 50 వేల ఏళ్లు ఆగాల్సిందే!

Once in 50000 year comet may be visible to the naked eye
  • ఫిబ్రవరి 1న భూమికి సమీపంగా సీ/2022 ఈ3
  • కళ్లతో నేరుగా చూడొచ్చు
  • లేదంటే బైనాక్యులర్లతో అయినా కనిపిస్తుంది
  • పట్టణాల కంటే పల్లెల నుంచి చూడడం నయం
ఓ అరుదైన తోకచుక్క భూమికి సమీపానికి వస్తోంది. దీని పేరు సీ/2022 ఈ3 (జెడ్ టీఎఫ్). గతేడాది మార్చిలో మొదటిసారి జూపిటర్ ను దాటుకుని వెళుతుండగా ఇది శాస్త్రవేత్తల కళ్లల్లో పడింది. ఇది త్వరలోనే సూర్యుడు, భూమికి సమీపంగా రానుంది.

సౌర వ్యవస్థలో మంచు ప్రాంతాలను దాటుకుంటూ జనవరి 12 నాటికి సూర్యుడికి సమీపంగా రానుంది. ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి 1న భూమికి సమీపానికి వస్తుంది. దీన్ని కళ్లతో నేరుగా చూడొచ్చు. లేదంటే మంచి బైనాక్యులర్ ఉన్నాకానీ స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో ఫుల్ మూన్ ఉంటే చూడ్డానికి కష్టం కావొచ్చని అంటున్నారు. 

పట్టణాల్లో లైట్ల కాంతి కంటే కూడా బయటకు వెళ్లి చూస్తే మంచిగా కనిపిస్తుంది. భూమికి సమీపానికి వచ్చినప్పుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుందని క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ తోకచుక్క ఒక కిలోమీటర్ పరిమాణంలో ఉంటుందని ప్యారిస్ అబ్జర్వేటరీ ఆస్ట్రో ఫిజిస్ట్ నికోలర్ బివర్ చెప్పారు. ఇదే తోకచుక్క మళ్లీ 50 వేల ఏళ్ల తర్వాతే భూమికి సమీపానికి వస్తుందని తెలిపారు.
comet
come
near earth
solar
50000 years

More Telugu News