సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
- స్కూళ్లకు ఈ నెల 12 నుంచి 18 వరకు సెలవులు
- ఉపాధ్యాయ సంఘాల వినతితో మంత్రి బొత్స ఆదేశం
- తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అధికారులు
అయితే, 17న ముక్కనుమ కావడంతో ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.
ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు తాజాగా జీవో విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.