Swaroopanandendra Saraswati: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కళ్లు తెరవాలి: స్వరూపానందేంద్ర స్వామి

Swaroopanandedra suggestion to AP and TS govts
  • అయ్యప్ప స్వామిపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్వరూపానందేంద్ర ఆగ్రహం
  • ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవద్దని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన
  • హిందూ సమాజాన్ని దూషించే వాళ్లను జైళ్లలో కుక్కాలన్న స్వరూపానందేంద్ర
కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిపై బైరి నరేశ్ అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత శక్తిమంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ప్రధానమైనదని చెప్పారు. హిందూజాతిని మేల్కొలిపే ప్రముఖ ఆలయాల్లో ఒకటని అన్నారు. అలాంటి అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడుపోయే వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ... సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. 

హిందూ దేవుళ్లపై దూషణలు జరుగుతున్నా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని స్వరూపానంద అన్నారు. ఈ దూషణలను అంత ఈజీగా తీసుకోద్దని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కళ్లు తెరవాలని చెప్పారు. కేవలం మైనార్టీలే కాకుండా హిందువులు కూడా ఓటర్లే అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. హిందూ దేవుళ్లను, హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడే వ్యక్తులను కఠినమైన సెక్షన్లతో జైళ్లలో కుక్కాలని చెప్పారు. ఇంకెవరూ ఇలాంటి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా శిక్షించాలని అన్నారు.
Swaroopanandendra Saraswati
Ayyappa Swamy

More Telugu News