AB Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అయ్యే దిశగా ఉంది: ఏబీ వెంకటేశ్వరరావు

AP may devide in to 3 states says AB Venkateswara Rao
  • సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్య
  • రాష్ట్రం మూడు ముక్కలయ్యే అవకాశాలున్నాయన్న ఏబీవీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ మూడు ముక్కలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేశ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం 'రాజ్యం.. మతం.. కోర్టులు.. హక్కులు' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏబీవీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలపాటి రాసిన పుస్తకం హేతుబద్ధమైన తాత్విక ఆలోచనలను అందిస్తోందని... రచయితలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలని చెప్పారు.

  • Loading...

More Telugu News