Chiranjeevi: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు

Chiranjeevi Waltair Veerayya pre release event venue changed
  • ఈ నెల 8న విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఆర్కే బీచ్ నుంచి వేదికను మార్చాలన్న పోలీసులు
  • ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వేదికను మార్చిన నిర్వాహకులు
బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం ఒంగోలులో జరగనుంది. వాస్తవానికి ఈ ఈవెంట్ ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ లో జరగాల్సి ఉంది. అయితే పోలీసుల నుంచి అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్ కు మార్చారు. ఇప్పుడు చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'పై కూడా ఇదే ప్రభావం పడింది. 

ఈ నెల 8న విశాఖ ఆర్కే బీచ్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే, వేదికను మార్చుకోవాలంటూ పోలీసు అధికారులు సూచించడంతో... ఆర్కే బీచ్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వేదికను నిర్వాహకులు మార్చారు. ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రను పోషించారు.
Chiranjeevi
Pre Release Event
Waltair Veerayya

More Telugu News