Inturi Nageswararao: కందుకూరు టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్

Police arrests Kandukur TDP incharge Inturi Nageswararao
  • ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభ
  • తొక్కిసలాటలో 8 మంది మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • నేడు మియాపూర్ లో ఇంటూరిని అదుపులోకి తీసుకున్న వైనం
ఇటీవల కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం కందుకూరు పోలీసులు ఇంటూరి నాగేశ్వరరావును హైదరాబాదులో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 

దీనిపై ఇంటూరి నాగేశ్వరరావు కార్యాలయ సిబ్బంది స్పందించారు. మియాపూర్ లోని ఇంటూరి నివాసానికి వచ్చిన పోలీసులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని, ఎక్కడికి తరలించారో తెలియదని అన్నారు. 

కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఇరుకురోడ్డులో సభ ఏర్పాటు చేసి, ప్రాణాలు పోవడానికి కారకులయ్యారంటూ చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇంటూరి సహా పలువురిపై కేసు నమోదు చేశారు.
Inturi Nageswararao
Arrest
Police
TDP Incharge
Kandukur
Nellore District

More Telugu News