Anjani Kumar: మంత్రి తలసాని కుమారుడి అయ్యప్ప పూజకు హాజరైన డీజీపీ అంజనీకుమార్

Anjan Kumar attends Talasani Saikiran Yadav Ayyappa pooja
  • అయ్యప్ప దీక్షలో ఉన్న తలసాని సాయికిరణ్ యాదవ్
  • తన నివాసంలో అయ్యప్ప పూజ నిర్వహణ
  • డీజీపీకి ఆహ్వానం.. స్వయంగా హారతి ఇచ్చిన డీజీపీ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఆయన ఇవాళ తన నివాసంలో అయ్యప్పస్వామి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కూడా హాజరయ్యారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న డీజీపీ స్వయంగా హారతి ఇవ్వడం విశేషం. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

అంజనీకుమార్ ఇటీవల తెలంగాణ నూతన డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం అంజనీకుమార్ కు బాధ్యతలు అప్పగించింది.
Anjani Kumar
TS DGP
Ayyappa Pooja
Talasani Saikiran
Talasani Srinivas Yadav

More Telugu News