Chiranjeevi: కూతురుకి రూ. 35 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi gifts his daughter Srija Rs 35 Cr house
  • చిన్న కూతురు శ్రీజ అంటే చిరుకు విపరీతమైన ప్రేమ
  • బంజారాహిల్స్ లో కూతురు కోసం ఖరీదైన ఇంటిని కొన్నట్టు టాక్
  • సంక్రాంతికి వస్తున్న చిరు చిత్రం 'వాల్తేరు వీరయ్య'
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్ లీడర్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. రవితేజ పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు.

ఇదిలావుంచితే, చిరుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం సినీ పరిశ్రమలో ఇప్పుడు వినిపిస్తోంది. తన చిన్న కూతురు శ్రీజ అంటే చిరంజీవికి చాలా ఇష్టం అనే విషయం తెలిసిందే. ఆమె ఏది అడిగినా ఆయన కాదనరు. తాజాగా శ్రీజ కోసం బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో చిరంజీవి ఓ ఇంటిని కొనుగోలు చేశారట. ఆ ఇంటి విలువ అక్షరాలా రూ. 35 కోట్లు అని చెపుతున్నారు.
Chiranjeevi
Tollywood
Srija

More Telugu News