Bellamkonda Ganesh: 'నేను స్టూడెంట్ సర్' పాప్యులర్ సాంగ్ నుంచి కొన్ని పిక్స్!

  • విభిన్నమైన కంటెంట్ తో 'నేను స్టూడెంట్ సర్'
  • కథానాయికగా పరిచయమవుతున్న అవంతిక 
  • సంగీత దర్శకుడిగా వ్యవహరించిన మహతి స్వరసాగర్ 
  • కీలమైన పాత్రను పోషించిన సముద్రఖని   
Nenu Student Sir Movie Update

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్' సినిమా రూపొందుతోంది. 'నాంది' సతీశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' కథానాయికగా పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సమకూర్చిన బాణీలలో నుంచి ఇటీవల వదిలిన 'మాయే మాయే' అనే సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్  అయింది. రఘు మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. ఈ పాటకి సంబంధించిన కొన్ని హైలైట్ షాట్స్ తాలూకు ఫొటోలను కొంచెం సేపటి క్రితం వదిలారు. మంచి ఫీల్ తో హీరో హీరోయిన్స్ కి సంబంధించిన ఈ స్టిల్స్ కనెక్ట్ అవుతున్నాయి.ఈ సినిమాలో సునీల్ .. సముద్రఖని ... శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఖరీదైన తన కొత్త ఫోన్ ను పోగొట్టుకున్న ఒక స్టూడెంట్, ఆ ఫోన్ కాజేసింది పోలీసులేనని ఫిర్యాదు చేస్తాడు. పర్యవసానంగా ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

More Telugu News