WaltairVeerayya: పూనకాలు లోడింగ్​ పాటకు శేఖర్​ మాస్టర్​తో బాబీ, డీఎస్పీ సూపర్ స్టెప్పులు.. వీడియో ఇదిగో!

Bobby and DSP steps with Shekhar Master for Poonakalu Loading song
  • ఈ నెల 13న విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య
  • చాన్నాళ్ల తర్వాత పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్న చిరంజీవి
  • హీరోయన్ గా శ్రుతి హాసన్, కీలక పాత్రలో రవితేజ
చాలా ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఆయనకు వీరాభిమాని అయిన బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ కీలక పాత్ర పోషించాడు. 

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ పోస్టర్లతో పాటు పలు పాటలతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించిన చిత్రం బృందం ఈ మధ్యే డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ పాటను వదిలింది. 

చిరంజీవి, రవితేజ నృత్యాలతో పాటు గొంతు కూడా కలిపిన ఈ పాట ఇప్పుడు సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు వచ్చేలా చిరు, రవితేజ తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మాస్ మాటకు శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు అందించాడు. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. 

ఈ క్రమంలో సెట్ లో పూనకాలు లోడింగ్ పాటకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులు వేసిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో శేఖర్ మాస్టర్ కు పోటీగా బాబీ, డీఎస్పీ.. సిగ్నేచర్ స్టెప్పు వేసి అలరించారు.
WaltairVeerayya
OnJan13th
PoonakaaluLoading
song
Chiranjeevi
dsp

More Telugu News