Tamannaah: నాని సినిమా విలన్ తో తమన్నా ప్రేమలో పడిందా?

Rumoured lovebirds Tamannaah Bhatia and Vijay Varma allegedly spotted kissing in Goa
  • గోవాలో న్యూ ఇయర్ వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్
  • ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్
  • ఎంసీఏ సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్
హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కొత్త ఏడాదిని గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ముద్దు పెడుతున్నట్టుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారన్న చర్చ ఊపందుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

 బాలీవుడ్ లో నటుడిగా పాప్యులర్ అయిన విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. 2017లో నాని హీరోగా నటించిన ఎంసీఏలో తను విలన్ గా నటించాడు. తమన్నా భాటియా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ సెట్స్‌లో తొలిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. డిసెంబర్ 21న తమన్నా పుట్టిన రోజున విజయ్.. తమన్నా నివాసంలో కనిపించాడు. ఆ తర్వాత పలు ఈవెంట్లకు వీరు జంటగా కలిసి వెళ్లారు. అయితే, తమ బంధం గురించి తమన్నా ఇప్పటిదాకా పెదవి విప్పలేదు.
Tamannaah
Vijay Varma
LOVE
Goa
party

More Telugu News