పవన్ మాట విన్న హరిరామజోగయ్య... దీక్ష విరమణ
- కాపు రిజర్వేషన్ల కోసం హరిరామజోగయ్య ఉద్యమబాట
- తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన వైనం
- ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడిన పవన్
అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్... హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. సమగ్రంగా చర్చించి ముందుకు వెళదామని హరిరామజోగయ్యకు పవన్ నచ్చచెప్పారు. మందులు వేసుకోకుండా దీక్షకు దిగడం సాహసోపేతమైన నిర్ణయం అని, ఇది సరికాదని పవన్... హరిరామజోగయ్యకు తెలిపారు. వెంటనే దీక్ష విరమించాలని సూచించారు.
పవన్ విజ్ఞప్తికి హరిరామజోగయ్య సానుకూల రీతిలో స్పందించారు. దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హరిరామజోగయ్య దీక్ష విరమించిన నేపథ్యంలో, ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.