Helicopters: ఆస్ట్రేలియాలో రెండు హెలికాప్టర్లు ఢీకొని నలుగురి మృతి

Two helicopters crash in Australia Gold Coast
  • సుప్రసిద్ధ పర్యాటక స్థలం గోల్డ్ కోస్ట్ లో ఘటన
  • ల్యాండవుతున్న ఓ హెలికాప్టర్
  • అదే సమయంలో టేకాఫ్ తీసుకుంటున్న మరో చాపర్
  • పరస్పరం ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు 
ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం గోల్డ్ కోస్ట్ లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇక్కడి సీ వరల్డ్ థీమ్ పార్క్ లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా, మరో హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఒక హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. మరో హెలికాప్టర్ లో కొంతభాగం దెబ్బతింది. ధ్వంసమైన హెలికాప్టర్ కూలిపోగా, పాక్షికంగా దెబ్బతిన్న హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన క్వీన్స్ లాండ్ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Helicopters
Crash
Gold Coast
Australia

More Telugu News