సమంత ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఖరారు

  • ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
  • గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 
  • ప్రధాన పాత్ర పోషించిన సమంత
సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శాకుంతలం'. ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై గుణశేఖర్, సమంత ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తుండగా.. మలయాళం నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడుగా నటించారు.  సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తయినా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది.

గతేడాది  నవంబర్ లోనే విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తర్వాత వాయిదా వేస్తున్నట్టు తెలిపింది చిత్ర బృందం. కానీ, చాన్నాళ్ల నుంచి విడుదల తేదీ గురించి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే, కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బరిలో ఉండటంతో ఫిబ్రవరి 17వ తేదీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Shakuntalam
Tollywood
Samantha
gunashekar

More Telugu News