Varla Ramaiah: ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా?: వర్ల రామయ్య

Jagan and his party leaders killed those 3 women says Varla Ramaiah
  • గుంటూరులో సభాస్థలిని పోలీసులు ముందుగానే పరిశీలించారన్న వర్ల 
  • పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా దుర్ఘటన ఎలా జరిగింది?
  • ముగ్గురిని జగన్, ఆయన పార్టీ నేతలే చంపేశారని ఆరోపణ
గుంటూరు టీడీపీ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందడం అందరినీ కలచి వేస్తోంది. ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన హత్యలని వైసీపీ నేతలు అంటుండగా... పోలీసుల వైఫల్యమని టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... చంద్రన్న కానుక కార్యక్రమాన్ని ఒక ఎన్నారై చేపట్టారని, పోలీసుల అనుమతితోనే కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు. పోలీసులు ముందుగానే వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. 

పోలీసులు పరిశీలించిన తర్వాత కూడా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు మహిళలు చనిపోయారా? లేక చంపేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతుండటాన్ని ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. ఈ పనులను వైసీపీ స్లీపర్ సెల్స్ చేస్తున్నాయని ఆరోపించారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP

More Telugu News